Pages

Friday, 5 January 2018

Pandya's folly on India's Prime Minister Modi! | భారత ప్రధాని మోడీపై పెద్దాయనకు భ్రమలు తొలిగాయ్!

Anna-Hazare-asks-Narendra-Modi-govt-to-pass-proper-Lokpal-Bill-Andhra-Talkies

Pandya's folly on India's Prime Minister Modi! | భారత ప్రధాని మోడీపై పెద్దాయనకు భ్రమలు తొలిగాయ్!

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ.. ప్రధాని అభ్యర్థిగా భాజపా తరఫున నియమితులు అయినప్పుడు.. 2014 ఎన్నికల ప్రచారానికి ముమ్మరంగా సాగుతున్నప్పుడు.. భాజపా భావజాలంతో ఏకీభవించకపోయినా.. ఆయన ప్రధాని అయితే.. నిజాయితీగల పాలన వస్తుందని కొన్ని మంచి నిర్ణయాలు వస్తాయని భావించిన వారు దేశంలో ఎందరో ఉన్నారు. తటస్థులు - మేధావులు కూడా పలువురు మోడీ పాలన కోసం ఎదురుచూశారు. అయితే ఆయన పాలన మొదలై నాలుగేళ్లు పూర్తవుతున్న ప్రస్తుత తరుణంలో.. అలాంటి వారందరూ మోడీ మీద పెట్టుకున్న ఆశలన్నీ భ్రమలేనని తేలిపోతున్నాయని అర్థమవుతోంది. దేశంలోనే విలువలకు పెద్దపీట వేసే గాంధేయవాది - సామాజిక కార్యకర్త అన్నా హజారే కూడా తాజాగా మోడీ పనితీరు మీద పెదవి విరవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. తాను డిమాండ్ చేస్తున్న లోక్ పాల్ - లోకాయుక్త విషయంలో సరైన బిల్లులు తీసుకురాకుంటే.. మార్చి 23 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ  అన్నాహజారే కొత్త హెచ్చరిక చేశారు.

దేశంలో రాజకీయ అవినీతికి సైతం చెక్ పెట్టగల లోక్ పాల్ - లోకాయుక్త వ్యవస్థలను కార్యరూపంలోకి తీసుకురావడం గురించి సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తొలినుంచి పోరాటం సాగిస్తున్నారు. ఇందుకోసం ఆయన అనేకమార్లు శాంతియుత దీక్షలను చేశారు కూడా. ప్రభుత్వాలు మాత్రం పెద్దగా స్పందించలేదు. తాజాగా అన్నా హజారే మాట్లాడుతూ.. ‘‘మోడీ ప్రభుత్వం రాజకీయ వ్యవస్థలో మార్పులు తెస్తుందని - దేశాన్ని అవినీతి రహితంగా మారుస్తుందని తాను ఆశించానని - తన ఆశలు నెరవేరలేదని’’ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆ మాటకొస్తే.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్  కూడా.. లోక్ పాల్ నియామకం చేపట్టాలని అంటున్నారు. నాలుగేళ్ల కిందటే చట్టం చేసినా.. నియామకం విషయంలో మోడీ సర్కార్ జాప్యం చేస్తున్నదనేది ఆయన వాదన. ఈ విషయంలో మోడీ ప్రభుత్వానివి బూటకపు విధానాలంటూ ట్విటర్ ద్వారా ఎద్దేవా చేశారు. అయితే అన్నా హజారే చెబుతున్న ప్రకారం.. లోక్ పాల్ బిల్లు సరైన రూపంలో లేదన్నది అర్థమవుతోంది. కాంగ్రెస్ భాజపాలు కలిసి ఈ బిల్లును నీరుగార్చాయనేది ఆయన వాదన. అందుకే.. ‘సరైన’ లోక్ పాల్ బిల్లు ప్రవేశపెట్టి దానిని చట్టంగా తేవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జనంలో నిజాయితీపరుడిగా మంచిపేరు ఉన్న అన్నా హజారే వంటి పెద్దాయన మోడీ సర్కారు పనితీరు మీద ఈ రేంజిలో అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషమే. 

American President Donald Trump is a sensational book | అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కు మెంటలా?..సంచలనంగా మారిన బుక్

Michael-Wolff-Trump-book-extract--how-his-team-handle-Donald-Trump-Andhra-Talkies

American President Donald Trump is a sensational book | అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కు మెంటలా?..సంచలనంగా మారిన బుక్

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ పై అమెరికాలో తాజాగా రిలీజ్ అయిన బుక్ పెను దుమారాన్ని రేపుతోంది. ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై సరికొత్త ఆందోళనలు రేపేలా ఈ పుస్తకం ఉండటం గమనార్హం. అధ్యక్ష పదవికి ఏ మాత్రం సరిపోని వ్యక్తిగా ఈ పుస్తకంలో పేర్కొన్నారు.

ట్రంప్ వ్యక్తిగత జీవితాన్ని చాలా దగ్గరగా పరిశీలించి.. సేకరించిన పుస్తకంగా దీన్ని పేర్కొంటున్నారు. ట్రంప్ మెంటలోడన్నట్లుగా ఈ పుస్తకం అమెరికాలో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ పుస్తకాన్ని రాసిన రచయిత మైఖేల్ వోల్ప్ ఈ పుస్తకంలో తాను రాసిన ప్రతి విషయానికి తాను కట్టుబడి ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఇంతకీ ట్రంప్ వ్యక్తిగత విషయాలు.. వైట్ హౌస్ లో ఆయన రాసిన వివరాలు ఆయనకు ఎలా వచ్చాయన్న దానికి ఆసక్తికర సమాధానం వస్తోంది. ట్రంప్ నకు వ్యూహకర్తగా వ్యవహరించిన స్టీవ్ బానన్ సహకారంతో సదరు పుస్తక రచయిత.. వైట్ హౌస్ లో ఏం జరిగిందన్న అంశంపై దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. బానన్ ను కొద్ది నెలల కిందటే ట్రంప్ డిస్మిస్ చేశారు. తాను రాసిన ప్రతి అంశం నిజమని.. తాను వాటికి కట్టుబడి ఉంటానని పుస్తక రచయిత పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే.. పుస్తక రచయిత మైఖేల్ వోల్ప్ కు ట్రంప్ ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఆయన తరపు వారు కొట్టిపారేస్తున్నారు.వూల్ప్ ఇప్పటికి 30 సార్లు ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ పంపినా.. ట్రంప్ మాత్రం ఓకే చేయలేదంటున్నారు. ఇంతకీ  పెను సంచలనంగా మారిన ఈ పుస్తకంలో ఏముంది? ఏం రాశారు? ఇప్పుడు వైట్ హౌస్ లోపల ఏం జరుగుతోంది? ట్రంప్ తన సతీమణితో ఎలా ఉన్నారు?  ఆయన కుమార్తె ఇవాంక ఎలాంటిది లాంటి ఎన్నో ఆసక్తకర.. వివాదాస్పద అంశాలు పుస్తకంలో ఉండటం గమనార్హం.

= ట్రంప్ కు అత్యంత సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం.. ఆయనది పూర్తిగా  చిన్న పిల్లాడి మనస్తత్వం. పిల్లలు ఎలా అయితే ఒకే విషయం మీద దృష్టి సారించరో.. ట్రంప్ కూడా అదే తీరుతో వ్యవహరిస్తుంటారు.

= అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ అనర్హుడు. ఏ విషయంపైనా.. విధాన పరమైన నిర్ణయం మీదా ఆయన పట్టుమని  పది నిమిషాలు కూడా దృష్టి నిలుపలేకపోతున్నారు. గతంలో ఒకే విషయాన్ని అరగంటలో పదిసార్లు చెప్పేవారు. ఇప్పుడు పది నిమిషాల్లో పదిసార్లు చెబుతున్నారు.

= కీలక వ్యక్తుల్ని కూడా గుర్తు పట్టటం లేదు. ఫాక్స్ న్యూస్ చీఫ్ రోజర్.. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ జాన్ బొయినర్ లను ట్రంప్ గుర్తించలేకపోతున్నారు. రాజ్యాంగంలోని కీలక అంశాల్ని విడమర్చి చెప్పినా ఆయన అర్థం చేసుకోలేదు  మొదటి డిబేట్ కు ముందు ఎనిమిది రోజుల పాటు ఆయనకు శామ్ నన్ బెర్గ్ అనే నిపుణుడి చేత అన్ని విషయాలు చెప్పించారు.

= అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే రోజు తన సతీమణి మెలినియాతో ట్రంప్ తీవ్రంగా గొడవపడ్డారు. ఆమె కళ్లనీళ్ల పర్యంతం అయ్యేటట్లు వ్యవహరించారు.

= ట్రంప్ కుమార్తె ఇవాంకా తన తండ్రి జుట్టురంగును వెక్కిరించేది. ఆ జుట్టులో తన తండ్రి బఫూన్ లా ఉన్నారనేది. అమెరికాకు తాను తొలి మహిళా అధ్యక్షురాలు కావాలన్నదే ఆమె ఆశ. ఆమె చాలా అత్యాశ ఉన్న మహిళ.

= స్నేహితుడి పెళ్లాన్ని పక్కలో పిలిపించుకోవటమన్నది గొప్ప అనుభూతిగా ట్రంప్ చెప్పేవారు. అలా చేస్తే జీవితం సార్థకతమవుతుందనేవాడు. ఒక స్నేహితుడి భార్యను అలానే రప్పించాలని చూశాడుకూడా. నువ్వు కోరుకున్న సౌఖ్యం నీ మొగుడి దగ్గర లేదని ఆమెను కెలికాడు.

= 2016 జూన్ లో రష్యా లాయర్ తో జూనియర్ ట్రంప్ మీటింగ్ దేశ ద్రోహంగా భావించాలంటూ ట్రంప్ కు వ్యూహకర్తగా వ్యవహరించిన స్టీవ్ బానన్ పేర్కొన్నారు.  ఆ తరువాత జేర్డ్ కుష్నర్ - పాల్ మనఫోర్ట్ లాంటి ప్రచార విభాగ అధికారులు కూడా రష్యన్లతో సమావేశమయ్యారు. చివరకు ట్రంప్ కూడా రష్యా అధికారులను - రష్యా న్యాయవాదిని కలిశారు. ఆఖరికి ట్రంప్ ప్రైవేట్ లీగల్ టీమ్ ప్రతినిధి మార్క్ కొరాలో కూడా న్యాయపరమైన దర్యాప్తు జరక్కుండా ట్రంప్ అడ్డుపడుతున్నారన్నారు.

= మీడియా కింగ్ రూపర్ట్ మర్డాక్ తో ట్రంప్ నిత్యం ఫోన్లో చాలాసేపు మాట్లాడతారు. దాదాపు ఆయన అమెరికా అధ్యక్ష వ్యవహారాల్లో ఓ భాగమైపోయారు. 

Rajamouli is the northern leaders who did not leave Bahubali | రాజమౌళి మూవీ బాహుబలిని వదిలిపెట్టని ఉత్తరాది నేతలు

Kumar-Vishwas-uses-Baahubali-to-burn-AAP-leadership-Andhra-Talkies

Rajamouli is the northern leaders who did not leave Bahubali | రాజమౌళి మూవీ బాహుబలిని వదిలిపెట్టని ఉత్తరాది నేతలు

టాలీవుడ్ ఇమేజ్ ను అమాంతం పెంచేసిన మూవీగా బాహుబలిని చెప్పాల్సిందే. తెలుగుసినిమా ఇండస్ట్రీ ఇమేజ్ ను లెక్కించే వేళలో బాహుబలికి ముందు.. తర్వాత అంటూ లెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా విడుదలైన ఇన్నాళ్లకు.. అవసరానికి అనుగుణంగా బాహుబలి పేరును ఉత్తరాది రాజకీయ నేతలు వాడేయటం కనిపిస్తోంది.

తాజాగా ఢిల్లీ అధికారపక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ బ్రాండ్.. సొంత పార్టీ అధినేతపై తరచూ నిప్పులు చెరిగే  అలవాటున్న నేత కుమార్ విశ్వాస్ తనను తాను బాహుబలిగా పోల్చుకోవటం గమనార్హం.

ఆప్ ప్రభుత్వాన్ని దెబ్బ తీయటానికి కుమార్ విశ్వాస్ ప్రయత్నిస్తున్నారంటూ గోపాల్  రాయ్ తనపై చేసిన వ్యాఖ్యల్ని తిప్పి కొట్టే ప్రయత్నంలో ఆయన బాహుబలి ప్రస్తావన చేశారు. తనను తాను బాహుబలితో పోల్చుకున్న ఆయన.. మున్సిపల్ ఎన్నికలు జరిగిన ఏడు నెలల తర్వాత గోపాల్ రాయ్ నిద్ర లేచినట్లుగా తప్పు పట్టారు.

ఆప్ పార్టీని మహిష్మతి సామ్రాజ్యంగా అభివర్ణించిన కుమార్ విశ్వాస్.. వేరొకరు శివగామిగా రాజ్యాన్నిపాలిస్తున్నారు.. ఈ బాహుబలిని చంపటానికి రోజుకో కట్టప్ప పుట్టుకొస్తున్నాడంటూ వ్యాఖ్యానించారు. తన లాంటి నేతకు రాజ్యసభ సీటు ఇవ్వకపోవటాన్ని తప్పు పట్టారు.

దీనికి గోపాల్ స్పందిస్తూ.. నిత్యం పార్టీపై విమర్శలు చేసే కుమార్ లాంటి నేతకు రాజ్యసభ స్థానం ఎలా ఇవ్వగలుగుతామని ప్రశ్నించారు. మిగిలిన రాజకీయం ఎలా ఉన్నా.. బహుబలి మూవీని ఇప్పటికి మర్చిపోలేదనటానికి ఢిల్లీ నేత వ్యాఖ్యలే నిదర్శనంగా చెప్పక తప్పదు. 

The central government which bombed Aadhar leak | ఆధార్ లీక్ పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం

Central-Govt-Confirms-Aadhar-Data-Leakage-Andhra-Talkies

The central government which bombed Aadhar leak | ఆధార్ లీక్ పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం

గోప్యంగా ఉంచాల్సిన ఆధార్ డేటా బయటకు వస్తే? ఊహించటానికి సైతం ఇబ్బందిగా ఉండే ఈ వ్యవహారం ఇప్పుడు గుబులు రేపుతోంది. ఆధార్ సర్వర్ డేటా బయటకు రావటంపై ఇప్పటికే పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత గోపత్యను పక్కన పెట్టేసి వ్యక్తుల ఆధార్ నంబర్.. అడ్రస్.. ఇతర సమాచారాన్ని బహిరంగంగా అందరికి అందుబాటులో ఉండేలా కొన్ని వెబ్ సైట్లు తీసుకొచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి.

దీనీకి సంబంధించిన సందేహాల్ని తాజాగా తెలుగు రాష్ట్ర ఎంపీలైన జేసీ దివాకర్ రెడ్డి.. కొత్తపల్లి గీత తదితరులు ప్రశ్నించారు. వీరి ప్రశ్నలకు కేంద్ర సర్కారు ఇచ్చిన అధికారిక సమాచారం వింటే షాక్ తినాల్సిందే. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఆధార్ లీకేజ్ నిజమని ఒప్పుకోవటం గమనార్హం.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన 210 వెబ్ సైట్లలో ఆధార్ డేటా ఇప్పటికి అందరికి అందుబాటులో ఉందని.. వాటిని తొలగించాలంటూ రెండు నెలల క్రితమే తాము ఆదేశాలు ఇచ్చినట్లుగా కేంద్రం వెల్లడించింది. విద్యా సంస్థలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 210 వెబ్ సైట్లలో ఆధార్ డేటాను ప్రదర్శిస్తున్నారని.. అందులో లబ్దిదారుల పేర్లు.. చిరునామా.. ఆధార్ నెంబర్ తోపాటు ఇతర సమాచారం కూడా ఉందని పార్లమెంటు సాక్షిగా ఒప్పుకోవటం ఇప్పుడు ఆందోళనల్ని పెంచుతోంది.

కీలకమైన ఆధార్ డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే ఎలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయన్నది ఇప్పుడు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ఆర్థిక నేరాలు జరుగుతాయోనని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేంద్రం ఇస్తున్న భరోసాకు తగ్గట్లే నేరుగా ఆధార్ సర్వర్ ను హ్యాక్ చేయలేకపోవచ్చు కానీ.. సర్వర్లను అధికారికంగా ఉపయోగించే వెబ్ సైట్ల.. వాటి సర్వర్లను హ్యాక్ చేయొచ్చని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఏమైనా.. గోప్యంగా ఉండాల్సిన ఆధార్ డేటా బయటకు రావటం మాత్రం ఆందోళన కలిగించే అంశమే. దీనిపై ప్రభుత్వం త్వరితగతిన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Mega Power Star Pawan Kalyan's fourth wife | మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు నాలుగో భార్యా?

Kathi-Mahesh-Counter-to-Poonam-Kaur-Andhra-talkies

Mega Power Star Pawan Kalyan's fourth wife | మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు నాలుగో భార్యా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ - ఫిలిం క్రిటిక్ కత్తి మహేశ్ మధ్య పోరు మరింత మంది వ్యక్తులకు విస్తరిస్తోంది. పవన్ కు మద్దతుగా కత్తిపై కొందరు నేరుగా విమర్శలు చేస్తుండగా ఆయన వారికి కూడా అంతే స్థాయిలో కౌంటర్లేస్తున్నారు. తాజాగా ఆయన టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ పై మండిపడ్డారు. పవన్ కు నాలుగో భార్యగా ఉంటానని ప్రకటించిన పూనమ్ కౌర్ కు తనను విమర్శించే అర్హత లేదన్నారు.
    
ఇటీవలే రచయిత కోన వెంకట్ పరోక్షంగా కత్తి మహేశ్ ను ఉద్దేశించి ట్వీట్ చేసి విమర్శించగా.. కత్తి మహేశ్ కూడా ఆయనకు దీటుగా సమాధానం ఇచ్చారు.తాజాగా  హీరోయిన్ పూనమ్ కౌర్ కు కూడా మహేశ్ స్ట్రాంగ్ డోసిచ్చాడు. పూనమ్ రీసెంటుగా మహేశ్ కత్తిపై విమర్శలు చేసింది.ఇతరులను విమర్శించడం ద్వారా డబ్బులు సంపాదించాలనుకునే వారి కంటే అడుక్కునే వారు ఎంతో ఉత్తములంటూ తన ట్విట్టర్ లో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 'ఆ ఫ్యాట్సోను రోజూ టీవీలో చూసి బోర్ కొడుతోంది. పాపం.. నిరుద్యోగ సమస్య... ఎవరో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు డబ్బులు డొనేట్ చేయండి. మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి కూడా మనం ఆహారం అందిస్తున్నాం. ఇది చాలా గొప్ప విషయం. అతనికి మంచి పని దొరకాలని కోరుకుంటున్నాను' అని మహేశ్ కత్తిని ఉద్దేశిస్తూ ఆమె వరుసగా ట్వీట్లు చేసింది.

Mega Power Star Pawan Kalyan's fourth wife

దీంతో కత్తి మహేశ్ కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా పూనమ్ చరిత్ర అంతా తవ్వి తీశాడు. సదరు హీరోయిన్ తనను ఫ్యాట్సో అంటూ మాట్లాడడంతోనే ఆమె సంస్కారం ఏంటో తెలిసిపోతోందని ఓ ఇంటర్వ్యూలో మహేశ్ విమర్శించారు. పవన్ కల్యాణ్ చేసిన సాయంతో ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె ఎంపికైందని అన్నారు. పవన్ మెప్పు కోసం తనపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తోందని తెలిపారు. పవన్ కల్యాణ్ వల్ల ఆమెకు ఉద్యోగం వచ్చిందని పవన్ కల్యాణ్ ఆమెకు బతుకుదెరువు చూపించినందుకు ఆమె తనపై విమర్శలు చేస్తోందని అన్నారు.'పవన్ కల్యాణ్ కి నాలుగో భార్య అవ్వడానికి రెడీ అని ఆమె గతంలో చెప్పిందని కత్తి మహేశ్ అన్నారు. 

Mega Power Star Pawan Kalyan's fourth wife

Tuesday, 26 December 2017

India Set To Be 5th Largest Economy in 2018 Overtaking UK France | భారత్ బ్రహ్మాండం! ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ మనదేనట!

India-Set-To-Be-5th-Largest-Economy-in-2018--Overtaking-UK--France-Andhra-Talkies-News
తెలుగు నేలకు చెందిన దివంగత ప్రధాని పీవీ నరసింహారావు... ఏ సమయంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారో గానీ... భారత ఎకానమీ అంతకంతకూ అభివృద్ధి చెందుతూనే దూసుకుపోతోంది. పీవీ హయాంలో ఆర్థిక మంత్రి హోదాలో మరో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అమలు చేసిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా భారత్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం ఎంతమాత్రం కాదనే చెప్పాలి. అభివృద్ధి చెందుతున్న దేశం హోదా నుంచి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందిన దేశంగా పయనం ప్రారంభించేసిన భారత్... ఎకానమీలో తనదైన శైలిలో సత్తా చాటుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ తీరు తెన్నులకు సంబంధించి ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన ఓ అంశాన్ని పరిశీలిస్తే.... ఈ విషయంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదనే చెప్పాలి.

ఆ అసలు సిసలు అంశంలోకి వెళితే... వచ్చే ఏడాది(2018) నాటికి భారత ఆర్థిక వ్యవస్థ... ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందట. ఈ మేరకు నేడు విడుదలైన *ద సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చీ* నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికా కరెన్సీ డాలర్ ఆధారంగా తీసుకుంటే...  వచ్చే ఏడాది నాటికి భారత్ ఎకానమీ... ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లోకెల్లా ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని ఆ నివేదిక వెల్లడించింది. ఇంతలా ఎదిగే భారత్... ఇప్పటిదాకా భారత ఆర్థిక వ్యవస్థల కంటే పై మెట్టులో ఉన్న బ్రిటన్ ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థలను జాబితాలో కిందకు నెట్టేస్తుందట.

అంతేకాకుండా రానున్న కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింతగా బలోపేతం కావడమే కాకుండా... ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మొదటి పది స్థానాల్లో ఉన్న దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా తీవ్రంగానే ప్రభావితం చేస్తుందని ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే... ఇప్పటిదాకా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా తన స్థానాన్ని కాపాడుకోగా... చైనా అంతకంతకూ ఎదిగే అవకాశాలు లేకపోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. 2032లోగా చైనా ఆర్థిక వ్యవస్థ అమెరికా ఆర్థిక వ్యవస్థను కిందకు నెట్టేసి ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కూడా ఆర్థిక వేత్తలు పక్కా గణాంకాలతో చెబుతున్నారు.
India Set To Be 5th Largest Economy in 2018 Overtaking UK France

Pandya's folly on India's Prime Minister Modi! | భారత ప్రధాని మోడీపై పెద్దాయనకు భ్రమలు తొలిగాయ్!

Pandya's folly on India's Prime Minister Modi! | భారత ప్రధాని మోడీపై పెద్దాయనకు భ్రమలు తొలిగాయ్! గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరే...